వేరు వేరు లక్షణాలతో కరోనాను ప్రమాదం లేకుండా జయించిన వారి అనుభవాలు - TeluguCircle-Trending News

Breaking

19 August 2020

వేరు వేరు లక్షణాలతో కరోనాను ప్రమాదం లేకుండా జయించిన వారి అనుభవాలు


కరోనా వ్యాప్తి వివిధ రకాలుగా, విభిన్నమైన లకణాలతో  రూపాంతరం చెందుతుంది, కరోనా బారిన వారు ఏ విధంగా  పోరాడారో  వారు  చెప్పినా సూచనలు కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ సదస్సులో పాల్గొన్న వారి అభిప్రాయాలను, ఇతర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం మరింత చొరవ తీసుకునేలా కృషి చేద్దామని’’ చంద్రబాబు పేర్కొన్నారు.  

సదస్సులో పాల్గొన్న వారి అభిప్రాయాలు:



కర్రి రామిరెడ్డి(మానసిక వైద్య నిపుణులు): కరోనా లాంటి విపత్తును ఎదుర్కోవడంలో మానసిక ధృఢత్వం అత్యంత కీలకం. కరోనా ఎక్కడో చైనాలో ఉంది, మన దేశానికి వచ్చినా మన రాష్ట్రానికి రాదు, మన రాష్ట్రంలో వచ్చినా మనకు రాదులే అనే రకమైన ఉష్ణపక్షి ఆలోచనలను మనం ముందు మానుకోవాలి. కరోనా భయంతో కంగారు పెరుగుతుంది, అందువలన ఇలాంటి విషయాలపట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ కరోనా అనే భయం మొదలైతే, జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావించి ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు.  వచ్చిన మార్పులను అంగీకరించలేక, ఒత్తిడికి లోనై, అనవసరంగా కోపం పెంచుకుంటున్నారు. ఆఫ్రికాలో ఊడూ అనే ఒక పద్దతి ఉంది. అది కూడా మన దగ్గరుండే మాయ, మంత్రం లాంటివే. వాటి వలన వాస్తవానికి జరిగేది ఏమీ లేదు. కానీ ఏదో మంత్రం వేశాడు, చేతబడి చేశాడనే ఆందోళనతో కొంత మంది చనిపోతారు. అప్పుడు అలాంటిదేదో ఉందని నమ్మడం మొదలు పెడతారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కొంత మంది ఏకంగా గబ్బిలాలు అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. మరికొందరు ఊరికే చేతులు కడుక్కునే ఓసీడీకి చేరుతున్నారు.
 
   అనవసరంగా భయపడకుండా సంతోషంగా ఉండేవారిలో ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సైకలాజికల్ ఫీలింగ్స్ వలన హార్మోన్స్ చక్కబడి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందువలన మనం సంతోషంగా ఉండడం చాలా అవసరం. ఒక మంచి నమ్మకంతో ఉండేవారు కూడా బాగానే ఉంటారు. బయో ఫీడ్ బ్యాక్ అంటే, మన బీపీని మనం చూస్తూ ఉంటే ఆ బీపీ ఎప్పటికీ తగ్గదు. అలా కాకుండా ఏదైనా చిన్న నమ్మకంతో, నిబ్బరంతో ఉండే వారిలో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మనలో ఉండే ఆత్మధైర్యాన్ని, బలాన్ని మేల్కొలిపినపుడు తప్పకుండా కరోనాను ఎదుర్కోగలం. ఎప్పుడైనా జబ్బు వచ్చే వరకు మనుషుల్ని భయపెట్టాలి. కానీ.. జబ్బు వచ్చిన వారికి మాత్రం భయం కాదు మనో నిబ్బరం కల్పించాలి. కరోనా సమయంలో ఆత్మవిశ్వాసం ఉండాలే తప్ప అహంకారం ఎంతమాత్రం పనికిరాదు. కరోనా సమయాన్ని పూర్తి పాజిటివ్ గా మార్చుకుంటే ఎన్నో రకాలైన పనులు చేసుకోవచ్చు. బంధాలు పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పరిపుష్టి చేసుకోవచ్చు.
ఎస్ ఎంఎస్ మంత్రం ప్రతిఒక్కరూ పాటించాలి. శానిటైజేషన్(ఎస్), మాస్క్(ఎం), సోషల్ డిస్టెన్సింగ్(ఎస్)...యోగా వంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కరోనాను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదు, కానేరదు.

డాక్టర్ పార్థసారధి,( సీనియర్ ఆర్థో సర్జన్, కరోనా నుంచి కోలుకున్న డాక్టర్) : అన్ని వ్యాధుల మాదిరిగా కరోనా కూడా ఒక వ్యాధి మాత్రమే. అంతకు మించి ఇంకేమీ లేదు. తొలుత నా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నాం. ధైర్యంగా ఉంటూ, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఎలాంటి వారైనా సరే కరోనా నుండి కోలుకోవడానికి అవకాశం ఉంది.
రామరాజు(రాజమండ్రి కార్డియాలజిస్ట్): కరోనాపై అధిక ప్రచారం, అధిక భయం, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కువ చనిపోవడం ప్రస్తుత పరిస్థితికి 3ప్రధాన కారణాలు. దీనితో మొదట్లో వైద్యులు, సిబ్బంది మానేయడం, ఆసుపత్రులు మూసేయడం జరిగింది. మళ్లీ తెరిచినా సిబ్బంది కొరత తీవ్రమైంది. ప్రస్తుతం చాలా వరకు నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలి. కొంత మంది డాక్టర్లు, స్వచ్ఛంద సేవా కార్యకర్తల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కీర్తించాలి.450మంది వైద్యులు ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రభుత్వ సేవల్లో పాల్గొనడం రాజమండ్రిలో విశేషం.
 నేను బతకాలి అనే కాంక్ష కోవిడ్ రోగుల్లో ఉండాలి, అప్పుడే మందులకు మరింత శక్తితో పనిచేస్తాయి. నిరాశ, నిస్పృహ, అనుమానం, భయం కోవిడ్ రోగులకు కీడు చేస్తాయి. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ సెగ్రిగేషన్, ఎర్లీ ట్రీట్ మెంట్ తో సత్ఫలితాలు వస్తాయి. ప్రజల్లో అప్రమత్తతే నివారణకు ఏకైక మార్గం. నెగెటివ్ భావం మొదలైన వ్యక్తికి ఎంత మెరుగైన వైద్యం అందించినా బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

వరుణ్(చిత్తూరు): బెంగళూరులో ఒకరోజు రాత్రి వలస కార్మికులు మా ఇంటి తలుపు కొట్టి 2రోజులుగా భోజనం లేదంటూ, క్రితం రోజు ఆహారమైనా పెట్టండని అడిగారు. చాలా బాధేసింది, నాకు చేతనైనంతలో నగరంలో వలస కార్మికుల ఆకలి తీర్చాలని అనుకున్నాను. 7గురు బృందంతో అన్నిచోట్ల భవన నిర్మాణ కార్మికుల వివరాలు సేకరించాం. ఉదయాన్నే 3గం లకే లేచి 8గం కల్లా భోజనం సిద్దం చేసేవాళ్లం. 64రోజులపాటు 10వేల మందికి భోజనం అందజేశాం. అపార్ట్ మెంట్ కొనడానికి దాచుకున్న డబ్బులు వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాను. ఫేస్ బుక్ ఫ్రెండ్స్ రూ లక్ష సమకూర్చారు. 1700మందికి మాస్క్ లు, శానిటైజర్లు అందజేశాం.
డా గోపి చంద్: నిరంతర శ్రమ సజీవ శక్తిగా మారుతుంది అనడానికి మీరే(చంద్రబాబే) స్ఫూర్తి. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ప్రస్తుతం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం వైరస్ పేండమిక్, సోషల్ పేండమిక్ తో పాటు.. ఫియర్ పేండమిక్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ‘‘ #StayHome #StaySafe’’ అనే నినాదం లాక్ డౌన్ కాలానికి సంబంధించినది. ఇప్పటి మంత్రం ‘‘ Safe Every Where-Strong o the Time ’’. ప్రతిరోజూ కొత్త శక్తి పుంజుకోవాలి. రోగుల్లో ఇటీవల అసంతృప్తి, ఆవేదన, అసహనం, అన్యాయం గమనించాను. రికవరీ అయినా అసంతృప్తి, ఆసుపత్రులలో బెడ్స్ దొరక్క అసహనం, ఆర్ధిక ఇబ్బందులతో ఆవేదన, ఇతర రోగులకు వైద్యం అందక అన్యాయం, అల్పన్యాయం చూశాను. హోమ్ ఐసొలేషన్, హెల్ప్ లైన్, టెలిమెడిసిన్ సద్వినియోగం చేసుకోవాలి. కోవిడ్ వల్ల గుణపాఠాలు నేర్చుకోవాలి, భవిష్యత్తులో వాటిని అమలు చేయాలి.

దేవళ్ల మురళి(కోవిడ్ సర్వైవర్): మా కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ఇంట్లోనే ఉండి మందులు వేసుకుని, రోజుకు 3సార్లు ఆవిరిపట్టి, కషాయం తాగి వ్యాధి నిరోధక శక్తి పెంచుకున్నాం. మా కళ్ల ముందే చాలామంది చనిపోయారు. అయినా ధైర్యంగ ఉన్నాం, అందుకే బైటపడ్డాం. మేము చెప్పేది ఒక్కటే, ధైర్యంగా ఉండండి-దూరం పాటించండి-మాస్క్ ధరించండి-ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దండి.

శివరామ్ ప్రసాద్(కోవిడ్ సర్వైవర్) : తొలుత జలుబు రావడం, తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం రావడంతో అనుమానం వచ్చి పరీక్షించుకుంటే కరోనా అన్నారు. సాధారణ మందులు వాడిన కొద్ది రోజులకే నెగెటివ్ వచ్చింది. ప్రభుత్వం కరోనా టెస్టుల విషయంలో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. టెస్టు కిట్లు లేవని చాలా మందిని వెనక్కి పంపేస్తున్నారు. కరోనా వచ్చిందని ఏకాంతంగా గడపడం కూడా మంచిది కాదు. ఆస్పత్రిలో ఉన్నా నలుగురితో నవ్వుతూ ఉండడం చాలా మంచిది.
కరోనా చికిత్సలో ఉన్న నాకు మీరు పంపిన లేఖ వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. కోవిడ్ తో సహజీవనం కాదు, పోరాడి గెలుద్దామనే భావన రావాలి. కోవిడ్ సెంటర్ లో నేను ఒంటరిగా ఉండకుండా నలుగురితో ఉండటం వల్ల నాలో నిరాశ ప్రబలకుండా చూసుకున్నాను. నాతో ఉన్నవాళ్లతో ప్రతిరోజూ మాట్లాడుతూ వారినీ యాక్టివ్ గా ఉంచేవాడిని. సంతోషమే సగం బలం అనేది అందుకే. 
 
సాయి కుమార్ లాలం, డేటా ఎనలిస్ట్ , ఐటి ప్రోపెషనల్: మా నాన్న కి వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుళ్లి సిటీ స్కాన్ చేస్తే కరోనా లాస్ట్ స్టేజ్ లో ఉందని తెలిసింది.   వేరే  కార్పోరేట్ హాస్పటల్ వాళ్లకు సిటీ స్కాన్ రిపోర్టు పంపిస్తే  సీరియస్ గా ఉంది,  ఐసీయు లో ఉంచాలన్నారు.  ఏ హాస్పిటల్ కెళ్లాలన్నా బెడ్ లు ఖాళీలు లేవు. అర్దరాత్రి సమయంలో ఎక్కడెళ్లాలో తెలీని పరిస్థితి. చివరకు తెలిసిన వ్యక్తి రెకమెండేషన్ తో  ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్చుకున్నారు.  ఇప్పటికీ ఐసీయులో నే ఉన్నారు. అయితే ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం.  కరోనా పట్ల జాగ్రత్తగా ఉండటమే కాదు, అత్యంత అప్రమత్తంగా కూడా ఉండాలి.
గంధం శ్రీనివాసరావు, (ప్రవేట్ టీచర్, విశాఖ జిల్లా): ప్రవేట్ విద్యా సంస్ధలో 20 సం. నుంచి టీచర్ గా పనిచేస్తున్నాను. నాకు 60 ఏళ్ల తల్లి, అంగవైకల్యం కల్గిన చెల్లి ఉంది.  లాక్ డౌన్ కారణంగా 5 నెలలుగా జీతాలు లేక ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.  నాలాంటి వేలాది మంది ఉపాద్యాయులు కరోనా వల్ల రోడ్డున పడ్డారు.   మీరు  మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్..
రెండున్నర గంటలపాటు జరిగిన ఈ వెబినార్ లో వైద్యులు, కోవిడ్ నుంచి కోలుకున్నవారు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.

No comments: